ప్రజావాణి,నంగునూర్ ఆగస్టు 24: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి, నంగునూర్ మండల ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, రైతు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు.సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలానికి చెందిన విక్రమ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమిస్తూ దేవులపల్లి యాదగిరి, చిన్నకోడూరు ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్‌తో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నూతనంగా నియమితులైన కిసాన్ సెల్ నాయకులకు సూచించారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి పలు సంక్షేమ పథకాలతో పాటు సబ్సిడీపై కందులు, పత్తి విత్తనాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి రైతుకు వాటి ప్రయోజనాలు అందేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రైతుల సమస్యలపై నిరంతరం పనిచేయాలని అన్నారు. కిసాన్ సెల్‌ను గ్రామస్థాయి వరకు బలోపేతం చేసి రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షులు తప్పేట శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అచ్చిన సత్తయ్య,పొన్నాల రాజేష్, భయ్యారం యాదగిరి,బిక్షపతి, శ్రీనివాస్, మల్లేశం రాజశేఖరరెడ్డి,పొన్నం ప్రశాంత్, బాలేపు రాజిరెడ్డి, బొంగోని రాజు, ఇంద్రకరణ్ రెడ్డి ,నర్సిములు,తదితరులు పాల్గొన్నారు.తథిరులు పాల్గొన్నారు.

