EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetకల్లూరు శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఏడుగురు అరెస్టు... నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర...

కల్లూరు శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఏడుగురు అరెస్టు… నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, స్వాధీనం

📰 Generate e-Paper Clip

ప్రజావాణి, నేరేడుచర్ల, ఆగస్టు 3: నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లూరు గ్రామ శివారులో అందర్–బాహర్ పేకాట నిర్వహిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు సోమవారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
దాడిలో అందర్–బాహర్ పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.1,500 నగదు, మూడు సెల్‌ఫోన్లు, రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అక్రమ పేకాట, జూద కార్యకలాపాలపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని, ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని నేరేడుచర్ల పోలీసులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.