📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarఎమ్మార్పీఎస్ అత్యవసర సమావేశం – కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం

ఎమ్మార్పీఎస్ అత్యవసర సమావేశం – కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం

📰 Generate e-Paper Clip

ఎమ్మార్పీఎస్ అత్యవసర సమావేశం – కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం

 

ప్రజావాణి వీణవంక ఆగస్టు 3

 

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం నిర్వహించారు.

 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు వీణవంక మండల బాధ్యులు అంబాల మదనయ్య, అరుణ్ మాదిగ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.

 

ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా బాధ్యులు మంద రాజు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలు, మండల కమిటీ ఏర్పాటు, జెండా గద్దెల నిర్మాణం చేపట్టడంతో పాటు సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు తునికి వసంత్ మాదిగ, ఎర్ర ఆదిత్య మాదిగ, దేవునూరి రవీందర్ మాదిగ, పర్లపెల్లి తిరుపతి మాదిగ, మిట్టపల్లి రాజేష్ మాదిగ, దాసరపు బుచ్చయ్య, కోరుకంటి తిరుపతి మాదిగ, కోరుకంటి రాజు మాదిగ, కోరుకంటి రామన్న మాదిగ, వడ్డేపల్లి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.