📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఉత్తమ సేవలకు తహసీల్దార్ భూపాల్‌కు ఘన సన్మానం

ఉత్తమ సేవలకు తహసీల్దార్ భూపాల్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

*ఉత్తమ సేవలకు తహసీల్దార్ భూపాల్‌కు ఘన సన్మానం*

మేడ్చల్ ఆగష్టు 19 (పీపుల్స్ డైరీ):- ప్రజలకు అందిస్తున్న సేవల్లో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ పనితీరు కనబరిచిన మేడ్చల్ తహసీల్దార్ భూపాల్‌కు ఘన సన్మానం లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు అందుకున్న భూపాల్‌ను మున్సిపల్ కౌన్సిలర్లు సురేష్ రెడ్డి, వేణుగోపాల్ గౌడ్, చిన్నోళ్ల భాస్కర్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తహసీల్దార్ భూపాల్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, విధుల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని అన్నారు.

జిల్లా స్థాయిలో ఉత్తమ తహసీల్దార్‌గా గుర్తింపు పొందడం మేడ్చల్ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భూపాల్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ తహసీల్దార్ భూపాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.