ఉత్తమ సేవలకు తహసీల్దార్ భూపాల్‌కు ఘన సన్మానం
*ఉత్తమ సేవలకు తహసీల్దార్ భూపాల్‌కు ఘన సన్మానం* మేడ్చల్ ఆగష్టు 19 (పీపుల్స్ డైరీ):- ప్రజలకు అందిస్తున్న సేవల్లో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ పనితీరు కనబరిచిన మేడ్చల్ తహసీల్దార్ భూపాల్‌కు ఘన సన్మానం లభించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు అందుకున్న భూపాల్‌ను మున్సిపల్ కౌన్సిలర్లు సురేష్ రెడ్డి, వేణుగోపాల్ గౌడ్, చిన్నోళ్ల భాస్కర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తహసీల్దార్ భూపాల్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, విధుల...