📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఆసరా పెన్షన్ల తేదీని పొడిగించండి

ఆసరా పెన్షన్ల తేదీని పొడిగించండి

📰 Generate e-Paper Clip

ఆసరా పెన్షన్ల తేదీని పొడిగించండి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

ఆసరా పెన్షన్ల తేదీని పొడిగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని కోరారు.ఆసరా పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర ప్రక్రియ అని చెబుతూనే కొన్ని కొరియర్ పెడుతుందని తెలిపారు.గత పది సంవత్సరాల నుండి ఆసరా పెన్షన్ కొత్తవి మంజూరు చేయలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆసరా పెన్షన్స్ మంజూరు చేస్తామని అర్హులైన అందరికీ పెన్షన్స్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం సరిఅయింది కాదని ఒంటరిగా జీవిస్తున్న మగవారి కూడా పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా పెన్షన్ మంజూరు చేయడం వలన వాళ్ళ జీవనోపాధి గడుస్తుందని,57 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగిందని ఆ మాటని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు.అంతే కాకుండా వ్యవసాయ కార్మికులకు భూమితో సంబంధం లేకుండా పన్నెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆటో కార్మికులకు 12 వేల రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇవ్వడం జరిగిందని హామీని నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి చేస్తున్నాం.ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్,సంఘం మండల నాయకులు రేణిగుంట్ల సాంబయ్య,వేముల కృష్ణకర్ బిలుకూరి తులసిరామ్,ఎర్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.