📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఅనాథలైన చిన్నారులకు కాంగ్రెస్ పెద్దల అండ....!

అనాథలైన చిన్నారులకు కాంగ్రెస్ పెద్దల అండ….!

📰 Generate e-Paper Clip

*అనాథలైన చిన్నారులకు కాంగ్రెస్ పెద్దల అండ.!*



పలుస మౌనిక కుటుంబానికి ₹10,000 తక్షణ సహాయం.!




‘బాగా చదువుకోండి.. మేమున్నాం’ అంటూ చిన్నారులకు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ అభయం.!



కేసముద్రం, ఆగస్టు 30,ప్రజావాణి.



అమ్మను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ చిన్నారుల కళ్లలో పెద్దలు ధైర్యాన్ని నింపారు. మేమున్నాం.. మీ చదువుకు మాదే బాధ్యత” అంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూపిన ప్రేమ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలుస మౌనిక ఇటీవల మరణించడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మిగిలిన మౌనిక పిల్లలను నాయకులు ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. వారి దీన స్థితిని చూసి చలించిపోయిన ప్రజాప్రతినిధులు, ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణ ఉపశమనం కోసం రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అక్కడికక్కడే అందజేశారు.


*చదువే వారి భవిష్యత్తు – పెద్ద మనసు చాటుకున్న నాయకులు!*


కేవలం ఆర్థిక సహాయంతోనే సరిపెట్టకుండా, ఆ చిన్నారుల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా చూస్తామని నాయకులు హామీ ఇచ్చారు. పిల్లల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, వారు సమాజంలో గొప్పగా ఎదిగేలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధులుగా కాకుండా, ఇంట్లోని పెద్ద దిక్కులా మారి పిల్లల చదువుకు భరోసా ఇవ్వడం వారి మానవత్వానికి నిదర్శనం. క్షేత్రస్థాయికి వచ్చి బాధితుల కన్నీళ్లు తుడిచిన నాయకుల చొరవపై ఉప్పరపల్లి గ్రామస్తులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.