📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఅధైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంది

అధైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంది

📰 Generate e-Paper Clip

అధైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంది

బాధిత కుటుంబాలు అధైర్య పడవద్దు అని అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఆదివారం, చర్లపాలెం గ్రామంలో కీ,శే,లు మేకపోతుల సత్తెమ్మ అకాల మరణం చెందగా వారి మొదటి సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన ఉంటూ బడుగు బలహీనుల బలోపేతానికి వారి వ్యక్తిగత వికాసానికి తోడ్పాటును,చేయూతనందిస్తుందని, బాధిత కుటుంబాన్ని ఓదార్చి వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.
అనంతరం చైర్మన్ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ నేటి యువత-రేపటి భవిత అని ప్రజల కోసం ఏర్పడిన ప్రజాస్వామ్య దేశంలో యువత రాజకీయాల్లోకి రావాలని,దేశ భవిత యువత రాజకీయాలపై ఆధారపడి ఉందని,పేద ధనిక లింగ బేధ ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సమాన ఓటు హక్కు కల్పించారని, ఐదు సంవత్సరాలకోసారి, ఎన్నికల నిర్వహణ,రిజర్వేషన్ ప్రక్రియ, నచ్చినవారికి ఓటు వేసే స్వేచ్చా హక్కులు కల్పించబడిందని, ప్రజాస్వామ్య పునాదులు మన గ్రామ పంచాయితీలని, ఆర్ధిక స్వలంబన బలోపేతానికి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయనైనదని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపారమైన నమ్మకంతో, స్థానిక స్వయం పరిపాలన సంస్థల్లో అనుభవం ఉన్న నాకు బాధ్యతలు అప్పగించారని, చిత్తశుద్ధితో ప్రతి మారుమూల గ్రామ పంచాయితీల అభివృద్ధి ధ్యేయంగా వ్యవస్థకు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.