అదృశ్యమైన వృద్ధురాలు వజ్జ నర్సమ్మ – లక్ష్మీపురం వాగులో మృతదేహముగా లభ్యం

కొత్తగూడ మండల ప్రతినిధి:- ఆగస్టు 09. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండల కేంద్రం పరిధిలోని దుర్గారం గ్రామ పంచాయతీ గుండ్రపల్లి గ్రామానికి చెందిన, వృద్ధురాలు వజ్జ నర్సమ్మ గత రెండు రోజులుగా కనిపించకుండా అదృశ్యమై పోయింది. వజ్జ నర్సమ్మ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. చివరకు తాజాగా లక్ష్మీపురం వాగులో నర్సమ్మ మృతదేహం లభ్యమైంది. వాగులో పడి మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటన తో దుర్గారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

