📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అక్కలరెడ్డిపల్లెలో దళిత భూములకు రక్షణ కరవు: మాదిగ ఇనాం భూముల ఆక్రమణపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

అక్కలరెడ్డిపల్లెలో దళిత భూములకు రక్షణ కరవు: మాదిగ ఇనాం భూముల ఆక్రమణపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల, ఆగస్టు 30:ప్రజావాణి వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామంలో దళితులకు చెందిన ఇనాం భూములు అక్రమార్కుల పాలు కావడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.తరతరాలుగా ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందాల్సిన సుమారు 7.50 ఎకరాల మాదిగ ఇనాం భూమిని ఇతర కులాల వారు అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యం, కొందరు సిబ్బంది తప్పుడు నివేదికల వల్ల తమకు న్యాయం జరగడం లేదంటూ బాధితులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పోరుమామిళ్ల మండల కేంద్రంలో నిరసన స్వరం వినిపించారు.

సర్వే నెంబర్ 1326A, 1326B లలో భారీ ఆక్రమణలు

అక్కలరెడ్డిపల్లె గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 1326A, 1326B లలో ఎస్సీ మాదిగలకు చెందిన దాదాపు ఏడున్నర ఎకరాల ఇనాం భూమి ఉంది. అయితే, ప్రస్తుతం ఈ భూమిలో ఒక్క సెంటు కూడా దళితుల ఆధీనంలో లేకపోవడం గమనార్హం. ఇతర కులాలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ భూమిని పూర్తిగా ఆక్రమించడమే కాకుండా, అందులో అక్రమ కట్టడాలు (భవనాలు) కూడా నిర్మించారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై తాము ప్రశ్నిస్తే.. “మీ పెద్దలు ఎప్పుడో ఈ భూములను మాకు అమ్మేశారు” అంటూ కట్టుకథలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.అధికారులను తప్పుదోవ పట్టించిన వీఆర్వో?భూ ఆక్రమణలపై గతంలోనే బాధితులు పోరుమామిళ్ల తాసిల్దార్ (ఎమ్మార్వో)ను ఆశ్రయించి అర్జీ సమర్పించారు. అయితే, ఆ అర్జీపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిన అప్పటి వీఆర్వో సుబ్రహ్మణ్యం బాధితులకు ఎటువంటి వివరణ ఇవ్వలేదని సమాచారం. పైగా, “సదరు మాన్యం భూమిపై ఎటువంటి సమస్యలు లేవు” అంటూ ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చి, వారిని పూర్తిగా తప్పుదోవ పట్టించారని ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ సిబ్బంది ఇలా అక్రమార్కులకు కొమ్ముకాయడం వల్లే దళితులకు న్యాయం జరగకుండా పోయిందని స్పష్టం చేశారు.ప్రస్తుతం విధుల్లో ఉన్న తాసిల్దార్ (ఎమ్మార్వో) అయినా ఈ సుదీర్ఘ భూవివాదాన్ని, దళితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల నాయకుడు దాసరపల్లి కిరణ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. తక్షణమే ఇనాం భూములను సర్వే చేయించి, అక్రమ కట్టడాలను తొలగించి, నిజమైన దళిత లబ్ధిదారులకు భూమిని అప్పగించాలని కోరారు.ఒకవేళ స్థానిక అధికారులు స్పందించకుంటే.. జిల్లా ఎమ్మార్పీెస్ నాయకత్వంలో ఈ సమస్యను వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కిరణ్ కుమార్ మాదిగ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భూములు కోల్పోయిన అక్కలరెడ్డిపల్లె గ్రామ బాధితులు ఆరోగ్యం,ప్రభాకర్,సామేలు, వినోదు,చిన్నప్ప, సునీల్, రమేష్, చిన్ని,రామయ్య,సిలువయ్యలతో పాటు పలువురు దళిత సంఘాల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.