అక్కలరెడ్డిపల్లెలో దళిత భూములకు రక్షణ కరవు: మాదిగ ఇనాం భూముల ఆక్రమణపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం
పోరుమామిళ్ల, ఆగస్టు 30:ప్రజావాణి వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామంలో దళితులకు చెందిన ఇనాం భూములు అక్రమార్కుల పాలు కావడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.తరతరాలుగా ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందాల్సిన సుమారు 7.50 ఎకరాల మాదిగ ఇనాం భూమిని ఇతర కులాల వారు అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యం, కొందరు సిబ్బంది తప్పుడు నివేదికల వల్ల తమకు న్యాయం జరగడం లేదంటూ బాధితులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పోరుమామిళ్ల మండల కేంద్రంలో నిరసన స్వరం వినిపించారు. సర్వే నెంబర్ 1326A,...