📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabad5 వ తరగతి విద్యార్థులకు నవోదయ అవకాశం.

5 వ తరగతి విద్యార్థులకు నవోదయ అవకాశం.

📰 Generate e-Paper Clip

5 వ తరగతి విద్యార్థులకు నవోదయ అవకాశం.

జులై 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పాఠశాలల హెచ్ఎం లకు ఆదేశాలు జారీ.

కోటగిరి ఎంఈఓ శ్రీనివాసరావు.

 

 

 

కోటగిరి/ప్రజావాణి:-మండల పరిధిలోని 5వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి 6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్షకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కోటగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ అర్హులని తెలిపారు.నవోదయ ప్రవేశ పరీక్ష నిమిత్తం 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యా యులకు ఆయన ఆదేశించారు.జులై 31 2026 లోగా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పూర్తి చేయించాలని ప్రధానోపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.నవంబర్ 28 న నవోదయ ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రతి విద్యార్థికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎంఈఓ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.