📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadహెచ్.ఎం.నరేంద్ర కుమార్ కు సతీవియోగం ఎమ్మెల్యే మురళి నాయక్ ఘన నివాళి

హెచ్.ఎం.నరేంద్ర కుమార్ కు సతీవియోగం ఎమ్మెల్యే మురళి నాయక్ ఘన నివాళి

📰 Generate e-Paper Clip

హెచ్.ఎం.నరేంద్ర కుమార్ కు సతీవియోగం
ఎమ్మెల్యే మురళి నాయక్ ఘన నివాళి..

ప్రజావాణి,నెల్లికుదురు:మండల కేంద్రం నెల్లికుదురు కు చెందిన పార్వతమ్మ గూడెం యుపిఎస్ హెచ్ఎం హెచ్చు నరేంద్ర కుమార్ సతీమణి అలివేలు గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. అలివేలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటు ప్రజలతో మమేకమవుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు అలివేలు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

*అలివేలు కన్నుమూత కాంగ్రెస్కు తీరని లోటు: ఎమ్మెల్యే*

అలివేరు కన్నుమూత సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ హుటాహుటిన వచ్చి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. హెచ్ఎం నరేంద్ర కుమార్ తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ ఆపద దుఃఖ సమయంలో మనోధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్య వచనాలు చెప్పారు. ప్రభుత్వంతోపాటు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అలివేలు ఆకస్మిక కన్నుమూత పార్టీకి తీరని లోటని,చురుకైన నాయకురాలిని కోల్పోయామని ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేశారు.యాదవ రెడ్డి, ప్రభాకర్ గౌడ్,హెచ్ వెంకటేశ్వర్లు,సత్యపాల్ రెడ్డి,ఆకుతోట సతీష్,పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, నాయిని శ్రీపాల్ రెడ్డి,బాలాజీ నాయక్, మద్ది రాజేష్, వెన్నం క్రాంతి రెడ్డి, మౌనేందర్, జగన్  బాబు , అఫ్రోజ్ పాషా తదితర నాయకులు అలివేలు భౌతిక కాయానికి నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.