📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetహుజూర్‌నగర్‌లో BLA సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన చీఫ్ విప్ & MLC బల్మూర్ వెంకట్

హుజూర్‌నగర్‌లో BLA సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన చీఫ్ విప్ & MLC బల్మూర్ వెంకట్

📰 Generate e-Paper Clip

హుజూర్‌నగర్ ప్రజావాణి జూలై 30: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న SIR ప్రక్రియ పురోగతిపై చీఫ్ విప్ & ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో BLA సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత నాయకులు, సూపర్‌వైజర్లకు సూచించారు.
సమావేశంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, నల్గొండ పార్లమెంట్ SIR ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, కోదాడ నియోజకవర్గం SIR ప్రక్రియ కోఆర్డినేటర్ అన్సారి, హుజూర్‌నగర్ నియోజకవర్గ ERO చిలక కిషోర్ పాల్గొన్నారు. అలాగే మండల, బ్లాక్ అధ్యక్షులు, BLA సూపర్‌వైజర్లు తదితరులు హాజరై SIR ప్రక్రియ అమలు, పురోగతిపై చర్చించారు.
ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ, SIR ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి నియోజకవర్గంలో ఆదర్శవంతంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.