📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమాల సమరశీలి కామ్రేడ్ యాలూరి స్వామి రెడ్డి,113వ జయంతి సందర్భంగా నివాళి

స్వాతంత్ర్య సమరయోధుడు, ఉద్యమాల సమరశీలి కామ్రేడ్ యాలూరి స్వామి రెడ్డి,113వ జయంతి సందర్భంగా నివాళి

📰 Generate e-Paper Clip

బేతంచెర్ల, నంద్యాల జిల్లా.బేతంచర్ల పట్టణంలోని సీపీఐ కార్యాలయం నందు.స్వాతంత్ర్య సమరయోధుడు,ఉమ్మడి కర్నూలు సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ యాలూరి స్వామిరెడ్డి 113వ జయంతి సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్.యన్న, సహాయ కార్యదర్శులు తాలూకా తిరుమలేష్,డి.దస్తగిరి ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి మధు,సీపీఐ నాయకులు భాస్కర్,ఉదయ్, శివ ల ఆధ్వర్యంలో కామ్రేడ్ స్వామి రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ. బ్రిటీష్ సామ్రాజ్యవాదుల కబంద హస్తాల లో శతాబ్దాల తరబడి బానిసత్వంలో మగ్గిపోయిన భరతమాత ఉక్కు సంకెళ్లను తొలగించేందుకు, స్వాతంత్ర్య సమరయోధుల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రాంతానికి చెందిన ప్రథముడు యాలూరు స్వామి రెడ్డి,నందికొట్కూరు తాలూకాలోని బీరవోలు గ్రామంలో జులై 1వ తేది 1913లో భూస్వామ్య కుటుంబంలో యాలూరు వెంకట్ రెడ్డి, శేషమ్మ దంపతులకు జన్మించారు.దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనే వారు ఉపన్యాసాలకు 1921 నవంబర్ నెలలో “వెల్స్ యువరాజు” ఇండియా వచ్చారు అతని పర్యటన వ్యతిరేకంగా జిల్లా బంధు చేయగా అందులో స్వామి రెడ్డి గారు ఉన్నారు.1928, 1929, సైమన్ కమిషన్ బహిష్కరిస్తూ కర్నూలు మున్సిపాలిటీలో తీర్మానం ఆమోదించి వాటి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు.1931లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టుఅయినా ప్రముఖులలో స్వామిరెడ్డి,ఒకరు.1932 లో నాటి కమ్యూల్ అవార్డుకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీచేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకి మద్దతుగా సత్యాగ్రహం లో పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1944లో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.1945లో నంద్యాలలో రైతులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. 1948లో పార్టీ నిషేధించబడింది అప్పుడు స్వామి రెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్లారు,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా మహబూబ్ నగర్, నల్లగొండ,ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పోరాటంలో పాల్గొని కాల్పులకు గురయ్యాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్వామిరెడ్డి గారు స్వగ్రామానికి మారువేషంలో వచ్చి వెళ్లేవారు. తమ ఇంట్లో ఉన్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు చుట్టుముట్టారు. చీర కట్టుకొని బాలింతను బయటకు పంపి ఆమె పిల్లవాడిని పాలిస్తున్నట్లు నటించి పోలీసుల బారి నుండి తప్పించుకున్నారు మరోసారి తమ బంధువుల వివాహానికి హాజరై పోలీసుల కళ్ళముందే గొంగడి వేసుకొని పెండతట్ట నెత్తిన పెట్టుకొని వెళ్లిపోయాడు. ఆయనను పట్టుకుంటే పదివేల రూపాయలు బహుమానంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కనపడితే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసిన వాటిని ఏమాత్రం ఖాతరు చేయక ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన దిశాలి కామ్రేడ్ స్వామి రెడ్డి గారు. 1952 లో జరిగిన ప్రథమ శాసనసభ ఎన్నికలలో నందికొట్కూరు నుండి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చండ్రపుల్లా రెడ్డి,గెలుపు కోసం విశేష కృషి చేశారు. 1957 నుండి 1960 వరకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ స్వామి రెడ్డి,పని చేశారు.జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం నందికొట్కూరు,నంద్యాల,ఆదోని,ఎమ్మిగనూరు,పత్తికొండ,డోన్ ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేశారు కార్మికులను,కర్షకులను సంఘటితం చేసి సమావేశపరిచి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేశారు.1971లో నంద్యాల 5వ లోకసభ ఎన్నికలలో పెండ కంటి వెంకటసుబ్బయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా,స్వామి రెడ్డి కమ్యూనిస్టు అభ్యర్థిగా పోటీ చేసి వారి మధ్య హోరాహోరు పోటీ జరిగింది స్వామి రెడ్డి,గెలుస్తారని అందరూ ఊహించారు.కానీ పోలింగ్ రేపటి రోజు అనగా ధన బలంతో పెండేకంటి వెంకటసుబ్బయ్య,చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయి ఓటమి చూసి చూశారు. 1972వ సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య రజోత్సవాల సందర్భంగా దేశ ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామర పత్రాన్ని అందుకున్న జిల్లా వాసి స్వామిరెడ్డి మొదటివారు. కర్నూలు జిల్లా సిపిఐ కార్యదర్శిగా 1969 నుండి 1979 వరకు పనిచేశారు అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు భూస్వామ్య కుటుంబంలో పుట్టిన తన శేష జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన త్యాగదనుడు తాను మరణించినా తన భౌతికయాన్ని తన బంధువుల బంధువులకు అప్పచెప్పవద్దని తన మిత్రుడు నంద్యాల వాసి పుల్లోజురావు సహచరులతో అనేవారు.నంద్యాలలో టీచర్ల ఇంట్లో అనారోగ్యానికి గురి కాగా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.17:8:1981న స్వామిరెడ్డి,అమరులై పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన సిద్ధాంతకర్త అమరజీవి స్వామి రెడ్డి, చిరస్మరణీయులు అని కొనియాడారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.