📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliసింగరేణి అధికారులు రోడ్డెక్కడం దౌర్భాగ్యమే

సింగరేణి అధికారులు రోడ్డెక్కడం దౌర్భాగ్యమే

📰 Generate e-Paper Clip

సింగరేణి అధికారులు రోడ్డెక్కడం దౌర్భాగ్యమే…
-నిరసన తెలిపితే కేసులు పెట్టే నైజం కాంగ్రెస్‌ పార్టీది.
-సింగరేణి సంస్థ మనుగడకు అండగా నిలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీ.
-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌.

గోదావరిఖని, మన సమగ్ర ప్రజావాణి జూలై 02

దేశానికి వెలుగులు అందించే సింగరేణిని నిర్వీర్యం చేస్తన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణి అధికారులను రోడ్డు మీదకు తీసుకురావడం దౌర్భాగ్యమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. గోదావరిఖని ఆర్జీ వన్ పరిధిలో అధికారులు చేస్తున్న దీక్షను ఆయన సందర్శించి సంఘీబావం తెలిపి అధికారులకు కొబ్బరినీళ్లు అందజేసి దీక్ష విరమింపజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తుందన్నారు. కంప్యూటర్‌ యుగంలో సైతం మనకు అన్నీ కనబడుతున్నా వినబడుతున్నా అవలీలగా మోసం చేస్తుందని,ఇలాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఉండదన్నారు.రాష్ట్రంలో మేధావులుగా చెలామణి అయ్యే కొందరు కాంగ్రెస్‌ పార్టీని నమ్మి వాళ్ల ద్వారా సామాన్య ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని అక్కున చేర్చుకున్నారని,దీంతో రాష్ట్రంలోని ప్రతి బిడ్డా మోసపోయాడని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రత్యక్ష రాజకీయాల్లో 25ఏండ్లుగా చూస్తున్నానని,సింగరేణి ద్వారా భూములు,ఊర్లు పోయినా ఈ ప్రాంతంలో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వ్యాపారాలు ఈ ప్రాంత అభివృద్దికి సింగరేణి ఉపయోగపడ్డదని,కానీ ఆ సింగరేణిని నిర్వీర్యం చేస్తూ సింగరేణిలో అధికారులు కూడా రోడ్డు మీదకు రావడం ఇంత కన్నా దౌర్బాగ్యం ఏమీ లేదని అన్నారు. ఆర్జీ త్రి పరిధిలో క్లర్క్‌లను ఆఫీసర్‌లను ట్రాన్స్‌పర్‌లు, సస్పెండ్‌ల పేరున ఐఎన్‌టీయూసీ వాళ్లు కక్ష్యకట్టి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు.దేశానికి స్వాతంత్య్రం తామే తెచ్చినమని,నిరసన తెలిపే హక్కులు తెచ్చినమని గొప్పలు చెప్పే కాంగ్రెస్‌ ఈనాడు ఈనాడు నిరసన తెలిపితే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇన్నేళ్ల చరిత్రలో అధికారులు దీక్షలు చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు.కేంద్రంలో ఒక పద్దతి రాష్ట్రంలో ఒక పద్దతి ఉండటం సరికాదన్నారు.ఆనాడు బీఆర్‌ఎస్‌ పార్టీ సింగరేణి సంస్థ కాపాడటంతో పాటు అభివృద్ది చేయడంలో ఎప్పుడు వెనుకాడలేదని,  అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను సంస్తను కాపాడటం జరిగిందని,భూసేకరణలను అద్బుతంగా చేసి సంస్థకు నష్టం చేయకుండా ముందుకు సాగినట్లు ఆయన గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేసే పార్తీ బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఆయన అన్నారు.పదేళ్లు సుపరిపాలన అందించిన బీఆర్‌ఎస్‌పై అనేక అబండాలు,ఆరోపణలు చేశారని,ఈనాటికి ఒక్కరి నిరూపణ చేయలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎన్నడూ స్వార్థం కోసం ఆలోచన చేయలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేశారని ఆయన తెలిపారు. సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన ఈసందర్బంగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.