📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialషాప్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

షాప్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

*వర్క్ షాప్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి,

*మన ప్రజావాణి*
మందమర్రి:- జులై 7

ఏరియాలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతోపాటు వర్క్ షాప్ కార్మికుల సమస్యలను సైతం పరిష్కరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి)నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం వర్క్ షాప్ లో ధర్నా నిర్వహించి, అనంతరం ఏరియా వర్క్ షాప్ డిజిఎం సురేష్ కు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, వర్క్ షాప్ లో కార్మికులను నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలైనా టెక్నీషియన్ల కొరత, టూల్స్, మిషనరీల మరమ్మతులు, ప్లేడేలు, మహిళా ఉద్యోగులకు వాష్ రూమ్ రిన్నోవేషన్ లాంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల సంభవించిన గాలి దుమారం ఏరియాలో పలు ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు విరిగి, విద్యుత్ కు తీవ్ర అంతరాయం కలిగిందని, కాలనీలో నేటికీ విద్యుత్ దీపాలు లేక చీకట్లో మగుతున్నాయని, వెంటనే వీధి దీపాలు కొనుగోలు చేసి, కార్మిక కాలనీలలో ఏర్పాటు చేయాలన్నారు. సర్వీస్ కేబుళ్లను మార్చాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్క్ షాప్ పిట్ కార్యదర్శి సిహెచ్పి శర్మ, ఏరియా నాయకులు టేకుమట్ల తిరుపతి, పెద్దపల్లి బానయ్య, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, సేఫ్టీ, పిట్ కమిటీ సభ్యులు ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, కొండ వెంకటేష్, సాధనవేని ప్రభాకర్, కన్నం వేణు, బైరి పోషాలు, పొన్నం శ్రీనివాస్, కే రాజయ్య యాదవ్, రామిరెడ్డి, డ్రైవర్ కుమారస్వామి, కే వెంకట్రావు, ఉరగొండ శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.