📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKamareddyవిద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి దుర్మరణం

విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి దుర్మరణం

📰 Generate e-Paper Clip

విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి దుర్మరణం

ప్రజావాణి ప్రతినిధి, బీర్కూరు మండలం: బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం, గ్రామానికి చెందిన నెమ్ల్లీ శ్రీనివాస్ గౌడ్ (42) తన పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతినికి భార్య, ఇద్దరు పిల్లలు  ఉన్నారు. గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకున్నాద్ధి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.