📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

•టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా కొత్త కార్యవర్గం వెల్లడి: ఏకగ్రీవంగా ఎన్నికైన అనిల్ కుమార్, శ్రీనాథ్, శ్రీనివాస్ రెడ్డి

రామచంద్రపురం, జూలై 09(ప్రజావాణి) :సంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జర్నలిస్టుల ప్రతినిధులుగా ఎన్నికైన వారు రాష్ట్ర నాయకత్వానికి, తోటి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికైన వారి వివరాలు: జనరల్ సెక్రటరీ: రూమాండ్ల అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు: శ్రీనాథ్, (వరుసగా రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక) జిల్లా సంయుక్త కార్యదర్శి: కే. శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బాధ్యులు మాట్లాడుతూ, తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు వీరహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఏ.కే. పైసల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తమ ఎన్నికకు సహకరించిన సంగారెడ్డి జిల్లా జర్నలిస్టు మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం. మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాం. రాబోయే కాలంలో జర్నలిస్టులందరినీ కలుపుకొని, యూనియన్ బలోపేతానికి, జర్నలిస్టుల గౌరవాన్ని పెంచేలా మరింత బాధ్యతతో అంకితభావంతో పనిచేస్తాం” అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.