📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriలయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ సమావేశం – ద్వితీయ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమంపై విస్తృత చర్చ

లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ సమావేశం – ద్వితీయ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమంపై విస్తృత చర్చ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 9: లయన్స్ క్లబ్ ఆఫ్ ఘట్‌కేసర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో రానున్న ద్వితీయ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. క్లబ్ చార్టర్ అధ్యక్షుడు సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాబోయే ఇన్‌స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి సభ్యుడి అభిప్రాయాన్ని గౌరవిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

కాబోయే అధ్యక్షుడు రేసు లక్ష్మారెడ్డి, కార్యదర్శి బచ్చు నాగేష్ కుమార్ గుప్తా, ఉపాధ్యక్షుడు బచ్చు ప్రమోద్ గుప్తా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి లయన్స్ జిల్లా 320ఎఫ్ నుండి ఆహ్వానించాల్సిన ప్రముఖులు, కార్యక్రమ నిర్వహణ విధానం, అతిథుల ఆహ్వానం, సభ్యుల బాధ్యతలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో మారం లక్ష్మారెడ్డి, అడ్వొకేట్ రామ్మోహన్, సీహెచ్ లక్ష్మారెడ్డి, బోగ శ్రీలక్ష్మి హరినాథ్, ఉడుత హిమబిందు నవీన్, మమతా శర్మ, కొన్నే మాధవి శ్రీధర్, సారా మురళి గౌడ్, సీహెచ్ మహేందర్ రెడ్డి, నాగిళ్ల నర్సింగ్ రావు, డాక్టర్ మొగులరం జంగయ్య, చుక్కా రవిశంకర్, అల్లు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

అదే విధంగా, మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్యా ప్రోత్సాహంతో సారా శ్రీనివాస్ గౌడ్ మరియు ఘట్‌కేసర్ లయన్స్ సభ్యులు కలిసి అనాథలకు రగ్గులు పంపిణీ చేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.