📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaరైతాంగ పోరాటానికి దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రైతాంగ పోరాటానికి దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

📰 Generate e-Paper Clip

రైతాంగ పోరాటానికి దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకం

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఐడీఓసీలో  దొడ్డి కొమురయ్య వర్థంతి కార్యక్రమం.

రాజన్న సిరిసిల్ల/ప్రజావాణి



తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రాపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన త్యాగనిరతి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతి కోసం నిబద్ధతతో పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, బీసీ అభివృద్ధి శాఖ అధికారి సౌజన్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, కురుమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.