📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalరాహుల్,ప్రియాంక గాంధీల అరెస్ట్ అనైతికం

రాహుల్,ప్రియాంక గాంధీల అరెస్ట్ అనైతికం

📰 Generate e-Paper Clip

రాహుల్,ప్రియాంక గాంధీల అరెస్ట్ అనైతికం

కాంగ్రెస్ మండల నాయకులు

చెన్నారావుపేట జూలై 24 ప్రజావాణి

విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ అనైతిక విధానానికి నిదర్శనమని, ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెన్నారావుపేట మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం చెన్నారావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ర్యాలీ వివేకానంద విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం అక్కడ నాయకులు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా సిద్ధన రమేష్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందన్నారు. దీనికి నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. బాధితులైన విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్ట్ చేయడం కేంద్రం నిర్బంధ వైఖరికి అద్దం పడుతోందని మండిపడ్డారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని లేదా వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నేతల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నాయకులతో చర్చించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు నచ్చజెప్పడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాను విరమించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు, మాజీ ఎంపీపీ, జిల్లా కార్యదర్శి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మండల కమిటీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.