📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రామాయంపేట ఫ్లైఓవర్ కోసం పోరాడింది భారతీయ జనతా పార్టీనే

రామాయంపేట ఫ్లైఓవర్ కోసం పోరాడింది భారతీయ జనతా పార్టీనే

📰 Generate e-Paper Clip





రామాయంపేట (ప్రజావాణి న్యూస్

మెదక్ జిల్లా రామాయంపేట ఆద్యగ్రౌండ్ వద్ద జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఫ్లైఓవర్ నిర్మించాలని మొదటి నుంచి నిరంతరం పోరాటం చేసింది. భారతీయ జనతా పార్టీ మాత్రమేనని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు అన్నారు. మెదక్ పార్ల మెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింద న్నారు. అనంతరం నేషనల్ హైవే అథారిటీపై నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ ప్రాజె క్టు ముందుకు వచ్చిందన్నారు. 2026 జూన్ 12న డీపీఆర్ సిద్ధమై కేంద్రానికి పంపబడిన అధికారిక పత్రాల కాపీలు ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. ఎవరి మాటలను నమ్మాల్సిన అవసరం లేదని ఆధారాలతో మాట్లాడే సంస్కృతి బీజేపీద న్నారు.గతంలో ప్రమాదాల నివారణ కోసం నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్మించిన రక్షణ గోడను కొందరు

బీఆర్ఎస్ నాయకులు కూల్చివేసిన ఫోటోలు కూడా ఉన్నాయ న్నారు.ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అధికారు లు చేప ట్టిన చర్యలను అడ్డుకున్న దృశ్యాలకు సంబంధించిన ఆధారా లను అవసరమైతే ప్రజల ముందుంచడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పుడు అదే నాయకులు ఫ్లైఓవర్ కోసం తామే పోరాడామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే

ప్రయత్నమన్నారు. డీపీఆర్ సిద్ధమైన తర్వాత క్రెడిట్ కోసం రాజకీయం చేయడం వల్ల చరిత్ర మారదని నిజాలు మారవన్నారు. మా దగ్గర డీపీ ఆర్ కాపీ ఉందని అధికారిక లేఖలు ఉన్నాయ న్నారు.ప్రతి అంశానికి సంబంధించిన ఆధా రాలు ఉన్నాయని అందుకే మేము ధైర్యంగా మాట్లాడుతు న్నామని ఎవరినీ నిరాధారంగా విమర్శించడం మా లక్ష్యం కాదన్నారు. కానీ పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రామాయంపేట ప్రజల భద్రత కోసం ఏమి చేసిందో చెప్పాలని ఇప్పుడు అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత క్రెడిట్ కోసం పోటీ పడటం రాజకీయలకు నిదర్శనమన్నారు. రామాయంపేట ప్రజలకు మా హామీ ఒక్కటే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ సందర్భం గా రామాయంపేట ప్రజల తరఫున మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.