📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliరామగుండంలో మిన్నంటిన సేవా కార్యక్రమాలు

రామగుండంలో మిన్నంటిన సేవా కార్యక్రమాలు

📰 Generate e-Paper Clip

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

గోదావరిఖని ,జూలై24, ప్రజావాణి:

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా శ్రమిస్తున్న నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోజంతా పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. రామగుండం ఐటీ పార్క్ ఏర్పాటుకు, నగర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుకు కేటీఆర్ ఎంతో కృషి చేశారని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ పార్క్‌ను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆపదలో అండగా నిలిచే కేటీఆర్‌కు తెలంగాణ సమాజం తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.

వేడుకల్లో భాగంగా దుర్గామాత ఆలయంలో పూజలు, మొక్కల నాటడం, విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ చేశారు. అలాగే డయాలసిస్ రోగులకు ఆర్థిక సాయం, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరం నిర్వహించారు. మధ్యాహ్నం పలు ఆశ్రమాల్లో వృద్ధులకు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో కౌశిక్ హరి, పీటీ స్వామి, నడిపెల్లి మురళీధర్ రావు, మూల విజయారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.