📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriరామకృష్ణాపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

*రామకృష్ణాపూర్ లో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

*పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు*

* *మన ప్రజావాణి*, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జులై 7

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) 32 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ ఏరియాలో ముందుగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రాచర్ల సురేష్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. తదనంతరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లూరు కళ్యాణ్,ఆర్ముల పోశం ,కాదాసీ సంపత్, కన్నూరి రాజేందర్, ఆవునూరి గట్టయ్య,రామిల్ల మల్లేష్ ,దాసరపు ఆగయ్య ,మారపల్లి రాజయ్య ,ఎల్లసాని శ్రీనివాస్, సలిగముల రమేష్, ఎంఎస్ఎఫ్ నాయకులు మారపల్లి సాయికుమార్, రేణిగుంట్ల అఖిల్, కవంపల్లి ప్రవీణ్, కలువల శ్రీనివాస్ ,కిరణ్, డప్పు కళాకారులు చిర్రావెంకటి ,తుంగ వెంకటేష్, గుడిసెల రమేష్,రెల్లి సంఘం నాయకులు నాగరాజు ,ప్రసాద్, ఎమ్ఎస్పి నాయకులు దుప్పటి రాజు, రేణిగుంట్ల ఈశ్వర్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.