📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliమాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పై అనుచిత వ్యాఖ్యలు మానాలి.. ఖబర్దార్

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పై అనుచిత వ్యాఖ్యలు మానాలి.. ఖబర్దార్

📰 Generate e-Paper Clip

మా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు మానాలి…. ఖబర్ధార్

రామగిరి,జులై 25

రామగిరి మండలం సుందిల్ల గ్రామ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, స్థాయిని దిగజార్చే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. తమ పార్టీ నాయకుడిపై అనుచితంగా మాట్లాడడం సరికాదని,రాజకీయ హుందాతనాన్ని పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలని,వ్యక్తిగత దూషణలు చేయడం సమంజసం కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామానికి రోడ్లు,సాగునీటి వసతులు, రైతు వేదికలు,పుష్కర ఘాట్లు,వైకుంఠధామాలు,కమ్యూనిటీ భవనాలు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొన్నారు.ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్న అనేక సౌకర్యాలు తమ పార్టీ పాలనలోనే ఏర్పాటయ్యాయని తెలిపారు.గ్రామాభివృద్ధిపై మాట్లాడే ముందు ని రాజకీయ భవిష్యత్ ఎక్కడినుండి ప్రారంభం అయిందో ఆలోచించుకోవాలని, సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓట్లతో గెలిచాను అని చెప్పుకొని గ్రామంలో తిరుగుతున్న నివు మా నాయకుని పేరు ఎత్తనిదే పూట గడవదని,ప్రస్తుతం నివు నడుస్తున్న రోడ్డు మా హయంలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలని, గతంలో గ్రామానికి ఎవరు ఏం చేశారో ప్రజలకు వివరించాలని,తమ నాయకుడిపై పిచ్చి మధు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని,మా నాయకుడు బీసీ బహుజన సిద్ధాంతంతో ఆపద వస్తె నేనున్నానంటూ ప్రతి ఒక్కరికీ బరోసా కల్పిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటుంటే జీర్ణించుకోలేని అగ్ర వర్ణ నాయకుడైన నివు విమర్శించే అర్హత తో పాటు ఆ స్థాయి నీకు లేదని  హెచ్చరించారు.మి నాయకుడు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో సుందిల్ల గ్రామానికి ఏమి చేయలేదని మీ నాయకుడిని నిలదీయాలని అన్నారు.రాజకీయ విమర్శలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడటం తగదన్నారు.
అలాగే,గ్రామ రైతులకు సింగరేణి నుంచి రావాల్సిన పరిహారం ఇప్పించే విషయంలో కృషి చేయాలని,చెరువులలో,గోదావరిలో నీటి నిల్వల ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించే చర్యలు,సాగు నీరు సరిగ్గా రాకపోవడంతో రైతులు,గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తక్షణమే చెరువులో సాగు నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికార ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ పార్టీ లేదా తమ నాయకుడిపై నిరాధార ఆరోపణలు,అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే తగిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో స్పందిస్తామని ఖబర్ధార్ అగ్రవర్ణ నాయకులార అంటూ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొగిరి భాస్కర్,గ్రామ యూత్ అధ్యక్షుడు కనుకుల సంజీవ్,సీనియర్ నాయకులు,కార్యకర్తలు ఘాటుగా హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.