📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మంత్రి నారా లోకేష్ సంస్కరణల ఫలితాలు ఇవి

మంత్రి నారా లోకేష్ సంస్కరణల ఫలితాలు ఇవి

📰 Generate e-Paper Clip

మంత్రి నారా లోకేష్ సంస్కరణల ఫలితాలు ఇవి

షైనింగ్ స్టార్స్ట్ అవార్డుల ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటి

ఆర్థిక మంత్రి పయ్యావులతో కలిసి విద్యార్థులకు అవార్డుల ప్రదానం

ఏపీలో విద్యాశాఖ దేశంలో ఆదర్శంగా నిలుస్తోందన్న దగ్గుపాటి

అనంత పురం జూలై 20 మన  ప్రజా వాణి
విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు మనం ఇప్పుడు చూస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన”షైనింగ్ స్టార్స్ – 2026″ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తో కలిసి అవార్డుల ప్రదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి, ఇంటర్మీడియ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, వారి భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ పేదరికం నుంచి వచ్చి ఈ స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారంటే ఇది ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమన్నారు. ఇందులో విద్యార్థుల ప్రతిభతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం చాలా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే పరిస్థితి కనిపించిందని..  కానీ నేడు అదే ప్రభుత్వ పాఠశాలల్లో నో-అడ్మిషన్ బోర్డులు పెడుతున్నారన్నారు. విద్యా ప్రమాణాలు గతం కంటే ఏ విధంగా మెరుగుపడ్డాయని చెప్పడానికి షైనింగ్ స్టార్సే నిదర్శనమన్నారు. ప్రభుత్వ బడిలో సౌకర్యాలు మెరుగుపడ్డాయని, నాణ్యమైన విద్యా కానుక కిట్లు అందజేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులను పూర్తిగా విద్యా బోధనకు పరిమితం చేశారని.. గతంలో ఉపాధ్యాయులను ఏవిధంగా ఇబ్బంది పెట్టారో చూశామన్నారు. విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతో పాటుగా.. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ షైనింగ్ స్టార్స్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వం అందిస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.