📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakబీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ కుమార్‌కు ఘన సన్మానం

బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ కుమార్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip


బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ కుమార్‌కు ఘన సన్మానం
మెదక్, జూలై 16: బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ కుమార్‌ను మెదక్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, దంతేపల్లి గ్రామ సర్పంచ్ మాస్కురి బాలరాజు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు బీజేపీ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో ప్రతి నాయకుడు, కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఎస్సీ మోర్చా సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మునిస్వామి, బీజేపీ జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, రాష్ట్ర నాయకులు నాగరాజు, చంద్రశేఖర్, జిల్లా ఇన్‌చార్జి సురేఖ పాల్గొన్నారు.
అలాగే మెదక్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మాస్కురి బాలరాజు, జిల్లా నాయకులు కర్రల స్వామి, కంచర్ల ప్రేమ్ కుమార్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.