📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialపేద విద్యార్థులకు న్యాయం చేయాలి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి

పేద విద్యార్థులకు న్యాయం చేయాలి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

*పేద విద్యార్థులకు న్యాయం చేయాలి*

*వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 19

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంపత్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సుమారు 4,200 నుంచి 4,500 కోట్ల రూపాయల వరకు విద్యాసంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 4,100 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్‌ బకాయిలను పూర్తిగా విడుదల చేయకపోవడంతో మొత్తం బకాయిలు సుమారు 8,200 కోట్ల రూపాయలకు చేరుకోనున్నాయన్నారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 850 కోట్ల రూపాయలను మాత్రమే విడతల వారీగా విడుదల చేసిందని, ఇది సమస్య పరిష్కారానికి సరిపోదని తెలిపారు. ఫీజు బకాయిల కారణంగా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, దీంతో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేక విద్యను మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. స్థానిక మంత్రి, ఎంపీ ఈ సమస్యను విద్యాశాఖను సైతం తన వద్దనే ఉంచుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, కళాశాల యాజమాన్యాలతో చర్చించి, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మహిళ నాయకురాలు ఎండి షరీఫా, పట్టణ అధ్యక్షురాలు జూపాక సంధ్య, సీనియర్ నాయకులు కండె తిరుపతి, మండల అధ్యక్షులు భూనేని సుగుణ, మున్సిపల్ ఇంచార్జి కోడూరి కవిత, పట్టణ ఉపాధ్యక్షులు ఓడ్నాల సత్యనారాయణ, సీనియర్ నాయకులు కొడివెల్లి రాజన్న, రాజేష్, నరేష్, అహల్య, రమాదేవి, పార్వతమ్మ, కళావతి, విశాలక్ష్మి, స్వప్న, జ్యోతి లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.