📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguపెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మల్లూరులో ప్రత్యేక పూజలు లక్ష్మీ నృసింహుడిని ప్రార్థించిన BRS...

పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మల్లూరులో ప్రత్యేక పూజలు లక్ష్మీ నృసింహుడిని ప్రార్థించిన BRS నాయకులు.

📰 Generate e-Paper Clip

  • పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మల్లూరులో ప్రత్యేక పూజలు
    లక్ష్మీ నృసింహుడిని ప్రార్థించిన BRS నాయకులు.

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ములుగు జిల్లా BRS పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు మల్లూరులోని ప్రసిద్ధ శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక అర్చన చేసి, సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకుడు తాటి కృష్ణ మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని, నల్లబెల్లి ZPTC గా, నర్సంపేట ఎమ్మెల్యేగా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారని కొనియాడారు.
“ఆయనకు గుండెనొప్పి రావడం దురదృష్టకరం. శ్రీ లక్ష్మీ నృసింహుని కృపతో ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలి” అని ఆకాంక్షించారు.
ప్రస్తుతం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని నాయకులు ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో తాటి కృష్ణ, బాడిశా నాగరమేష్, కొమరం ధనలక్ష్మి, నూతల కంటి ముకుందం, సిద్ధంశెట్టి లక్ష్మణరావు తో పాటు పెద్ద సంఖ్యలో BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మీ*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.