📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialపలువురు ప్రముఖులకు రాజ్యాధికార సమరభేరి ఆహ్వానాలు

పలువురు ప్రముఖులకు రాజ్యాధికార సమరభేరి ఆహ్వానాలు

📰 Generate e-Paper Clip

*పలువురు ప్రముఖులకు రాజ్యాధికార సమరభేరి ఆహ్వానాలు*

* *మన ప్రజావాణి*, మంచిర్యాల జిల్లా ప్రతినిధి/మందమర్రి:- జూలై 1



మనమెంతో మనకంత అనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న  భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాజ్యాధికార సమరభేరి మహాసభకు రావాలని కోరుతూ జిల్లాలోని పలువురికి జిల్లా రాజ్యాధికార పార్టీ కోకన్వీనర్ కోరే రంజిత్ కుమార్, జిల్లా నాయకుడు అర్కటి రవీందర్ యాదవ్ ఆహ్వాన పత్రికలు అందించారు. ఆహ్వాన పత్రికలు అందుకున్న ముఖ్యులలో చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్  నల్లాల ఓదెలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోత్కు సుదర్శన్, బహుజన సమాజ్ వాదీ పార్టీ చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  ముల్కల్ల రాజేంద్రప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గజెల్లి లక్ష్మణ్ తో పాటు పలువురు ప్రముఖులకు రాజ్యాధికార సమరభేరి ఆహ్వాన పత్రికలు అందించారు. ఈసందర్భంగా రాజ్యాధికార పార్టీ జిల్లా కో కన్వీనర్ కోరే రంజిత్ కుమార్, జిల్లా నాయకులు ఆర్కటి రవీందర్ యాదవ్ లు మాట్లాడుతూ, పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మహాసభకు జిల్లా నుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై మనమెంతో మనకంత వాటా దక్కాలనే సంకల్పంతో ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభను జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొక్కెర రాజు కురుమ, చిట్టబోయిన రాజు యాదవ్, కార్యకర్తలు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.