📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriనారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్రోకర్ల దందా..?

నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్రోకర్ల దందా..?

📰 Generate e-Paper Clip

నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్రోకర్ల దందా..?
ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.40 వేల వసూలు చేశారనే ఆరోపణలు – డాక్యుమెంట్ రైటర్లు, బ్రోకర్లపై విమర్శలు
నారపల్లి, జూలై 30 (ప్రజావాణి):


నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్రోకర్ల దందా, డాక్యుమెంట్ రైటర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోందని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రజలు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వస్తే, అధికారిక ఫీజులకు అదనంగా భారీ మొత్తాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో ఓ సామాన్యుడి వద్ద నుంచి సుమారు రూ.40 వేల వరకు బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లు వసూలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారిక ధృవీకరణ లేదు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శకత లేకపోవడం వల్ల మధ్యవర్తులే వ్యవహారాలను నియంత్రిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ఫీజులకు మించి ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, తప్పులు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.