📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKamareddyతిరుమలపూర్‌లో భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా బోనాల సంబరాలు

తిరుమలపూర్‌లో భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా బోనాల సంబరాలు

📰 Generate e-Paper Clip

తిరుమలపూర్‌లో భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా బోనాల సంబరాల

కోటగిరి, జూలై 31: కోటగిరి మండలం తిరుమలపూర్ గ్రామంలో శుక్రవారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని ఆటపాటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం చిన్నారులు, మహిళలు ప్రధాన వీధుల గుండా నృత్యాలు చేస్తూ బోనాల ఊరేగింపును నిర్వహించగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోయి సైదవ్వ, వార్డు సభ్యులు కాలే లక్ష్మీబాయి, రమాబాయి, గ్రామస్తులు కాలే గంగారం, విజయ్, సాయి కృష్ణ, రవి, నగేష్, గోపాల్, యాదవరావు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల వేడుకలను విజయవంతం చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.