📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialచదువుతోపాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చదువుతోపాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

📰 Generate e-Paper Clip

చెన్నూరు సివిల్ కోర్టు జడ్జి పి. రవి

ఎంజేపీ కళాశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు

 విద్యార్థులతో కలిసి భోజన నాణ్యతను పరిశీలించిన న్యాయమూర్తి

చెన్నూరు,జూలై24, ప్రజావాణి:

విద్యార్థులు తమ విద్యాభ్యాసంతో పాటు దేశ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి. రవి సూచించారు. మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణ కేంద్రంలోని ఎంజేపీ (MJP) కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి పి. రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.విద్యార్థి దశ నుంచే భారత న్యాయస్థానాలు, రాజ్యాంగం కల్పించిన చట్టాలపై పట్టు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలో మారుతున్న పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. మహిళా చట్టాలు, బాలికల భద్రత, ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్, సైబర్ మోసాల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. అలాగే గంజాయి, గుడుంబా మరియు ఇతర మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటిని ఉపయోగిస్తే చట్టపరంగా ఎదురయ్యే కఠిన శిక్షల గురించి వివరించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చదువు ఒక్కటే మార్గమని, విద్యార్థులు చదువును కష్టంగా భావించకుండా ఇష్టంతో చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆయన పిలుపునిచ్చారు.

కళాశాలలో భోజన నాణ్యత పరిశీలన

సదస్సు అనంతరం జడ్జి పి. రవి కళాశాలలోని వంటగదిని, అక్కడ ఉన్న పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా లేదా అని నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో చెన్నూరు బార్ కౌన్సిల్ సభ్యులు, స్థానిక పోలీసు అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.