📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గుగ్గిళ్ళలో బాలవికాస ఆధ్వర్యంలో సన్‌రైజ్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

గుగ్గిళ్ళలో బాలవికాస ఆధ్వర్యంలో సన్‌రైజ్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,జూలై 20 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ళ గ్రామంలో బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, సన్‌రైజ్ హాస్పిటల్ సహకారంతో గ్రామ ప్రజల కోసం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ యొక్క వైద్య శిబిరంలో వైద్యులు గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు తెలిపి అవసరమైన వారికీ సుమారు 30 వేల రూపాయలు గల మందులను అందజేశారు.ఈ ఉచిత వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సన్‌రైజ్ హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బందిని శాలువాలతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో సన్ రైస్ హాస్పిటల్ క్యాంపు మేనేజర్ కొత్తూరు రాజేందర్, డాక్టర్ రమణి, దేవ శ్రీనివాస్, సతీష్ రాజు, గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ మల్లయ్య, ఉపసర్పంచ్ లావణ్య, బాలవికాస సంస్థ కోఆర్డినేటర్ వట్టి సుజాత,వనిత, వాసవి, పంచాయతీ కార్యదర్శి వంశీధర్, గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.