📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriకారును వెంబడించి బెదిరించిన ఇద్దరు యువకుల అరెస్ట్

కారును వెంబడించి బెదిరించిన ఇద్దరు యువకుల అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 1: కారులో కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న వ్యక్తిని వెంబడించి భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరు యువకులను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఘటనకు ఉపయోగించిన పల్సర్ ఎన్‌ఎస్ 160 మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్‌కు చెందిన పోడు సాయి కుమార్ ఈ నెల 21న వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తన కుటుంబ సభ్యులతో కలిసి హోండా అమేజ్ కారులో వస్తుండగా, ఔషపూర్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు. దారి ఇవ్వకపోవడంతో సాయి కుమార్ హారన్ మోగించగా, ఆగ్రహించిన యువకులు ఘట్‌కేసర్–ఔషపూర్ నుంచి యమ్నంపేట చౌరస్తా వరకు కారును వెంబడించారు.

ఈ క్రమంలో కారులో ఉన్న కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు కారును చేతులతో కొట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

అరెస్టయిన వారు రంగ శివ (21), అరిగె అఖిల్ (20)గా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి టీఎస్30కే3503 నంబర్ గల పల్సర్ ఎన్‌ఎస్ 160 బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలకు ఇబ్బంది కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.