📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం.... కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల...

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం…. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

బెజ్జంకి,జూలై 17(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట్, తోటపెల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వమే నెరవేర్చిందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ వాతావరణం నెలకొందని, త్వరలోనే రెండో విడతలో అర్హులైన లబ్ధిదారులకు కూడా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.లబ్ధిదారులు తమ సొంతింటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బేగంపేట్ సర్పంచ్ ఎల విజయ, ఉపసర్పంచ్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువెరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.