📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కవలకుంట్ల టూ పోరుమామిళ్ళ ఆటోల దోపిడీపై ప్రయాణికుల ఆగ్రహం. అక్రమ ఆటోలను బంద్ చేసి, ఆర్టీసీ*...

కవలకుంట్ల టూ పోరుమామిళ్ళ ఆటోల దోపిడీపై ప్రయాణికుల ఆగ్రహం. అక్రమ ఆటోలను బంద్ చేసి, ఆర్టీసీ* *బస్సులు నడపాలని గ్రామస్థుల డిమాండ్*!

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 06) మండలంలోని కవలకుంట్ల గ్రామ ప్రజలను ఆటో నిర్వాహకులు ఛార్జీల పేరుతో నిలువుదోపిడీ చేయడమే కాకుండా,ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగడంపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 11 కిలోమీటర్ల దూరమున్న కవలకుంట్ల నుండి పోరుమామిళ్ళకు గతంలో రూ. 10 ఉన్న ఛార్జీని ఏకంగా రూ. 30 కి పెంచేసి, “దిక్కున్న చోట చెప్పుకోండి” అంటూ ఆటోల వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి అక్రమ ఆటోలను బంద్ చేయించాలని, సామాన్యులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ బస్సులను పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.పెరిగిన ఛార్జీలతో సామాన్యుల కష్టాలు మూడింతల భారం: గతంలో రూ. 10 ఉన్న ఛార్జీని రూ. 30 కి పెంచడంతో పేద,మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పడుతోంది.నిత్యం ప్రయాణించే వారికి ఇబ్బంది: కూలీ పనులకు వెళ్లేవారు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు, ఆసుపత్రి పనుల*నిమిత్తం రోజువారీగా పోరుమామిళ్ళకు వెళ్లేవారు ఈ పెరిగిన ఛార్జీలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు*.దౌర్జన్యపూరిత సమాధానాలు: రేట్లు ఎందుకు పెంచారని ప్రశ్నించిన ప్రయాణికులపై ఆటో డ్రైవర్లు దురుసుగా ప్రవర్తిస్తూ, దిక్కున్న చోట చెప్పుకోమంటూ సవాళ్లు విసురుతున్నారు*అదేవిధంగా మీ ఎస్సీ కాలనీకి మేము ఆటోలు రానివ్వము మీ వాళ్ళని మేము ఎక్కించుకోమని దుస్తుగా ప్రవర్తిస్తున్నారు.ఆటోల పర్మిషన్లపై విచారణ. అక్రమ వాహనాలపై నిషేధం*ఈ మార్గంలో నడుస్తున్న ఆటోల వల్ల ప్రయాణికులకు రక్షణ కరువైందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.ఫిట్నెస్ & పర్మిషన్ల తనిఖీ: అసలు ఈ మార్గంలో తిరుగుతున్న ఆటోలకు సరైన ప్రభుత్వ పర్మిషన్లు, రవాణా శాఖ, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా లేదా అని అధికారులు సమగ్ర విచారణ జరపాలి. అక్రమ ఆటోల బంద్: నిబంధనలు ఉల్లంఘిస్తూ, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తూ, అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆటోలను ఈ మార్గంలో పూర్తిగా బంద్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.ఆర్టీసీ బస్సులు నడపాలని గ్రామస్థుల డిమాండ్*ఆటోల దౌర్జన్యానికి శాశ్వత పరిష్కారం కేవలం ప్రభుత్వ రవాణా వ్యవస్థతోనే సాధ్యమని కవలకుంట్ల గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వ బస్సుల ఆవశ్యకత: కవలకుంట్ల నుండి పోరుమామిళ్ళకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సులను నడపాలి. దీనివల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఎంతో సురక్షితమైన మరియు చౌకైన రవాణా అందుబాటులోకి వస్తుంది.మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటు: ప్రభుత్వ బస్సులు అందుబాటులోకి వస్తే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం చేకూరి, ఆటోల దోపిడీ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం వీడాలి రవాణా శాఖ, పోలీస్ అధికారులు మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉమ్మడిగా స్పందించి, తక్షణమే విచారణ చేపట్టి కవలకుంట్ల గ్రామ ప్రజలకు శాశ్వత న్యాయం చేయాలని గ్రామస్థులు ముక్తకంఠంతో కోరుతున్నారు.ఇట్లు,కవలకుంట్ల గ్రామ ప్రజలు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.