📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఉపాధి సిబ్బంది నిరసన..ఎంపీడీవో కు వినతి

ఉపాధి సిబ్బంది నిరసన..ఎంపీడీవో కు వినతి

📰 Generate e-Paper Clip

ఉపాధి సిబ్బంది నిరసన..ఎంపీడీవో కు వినతి
ప్రజావాణి,ఇనుగుర్తి:ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఇనుగుర్తి మండలం వివిధ గ్రామాలకు చెందిన విబిజి రాంజీ( ఎన్ఆర్ఈజీఎస్)సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. ఈ మేరకు ఎంపీడీవో పార్థసారథికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వి బి జి రామ్ జి ఫీల్డ్ అసిస్టెంట్లు,సిబ్బంది మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం లోని సిబ్బందిని అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేసి,పేస్కేల్ ఇస్తామని ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని రెండు సంవత్సరాలు గడిచినా ఈ సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే రెగ్యులర్ చేస్తూ పెండింగ్ లో ఉన్న మూడు నెలల జీతాలను విడుదల చేసి విబిజి రాంజీ సిబ్బంది కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రతినెల ఒకటవ తారీఖున జీతాలు ఇచ్చి అమలు చేయాలన్నారు.ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ దీప్లా, టి ఏ లు రంజిత్, అశోక్, కంప్యూటర్ ఆపరేటర్ పాపారావు, ఫీల్డ్ అసిస్టెంట్లు గుర్రం సత్యం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.