📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అధికారుల ‘కక్కుర్తి’.నేతల ‘కబ్జా’.ఎగువతంబళ్లపల్లె గ్రామపంచాయతీ లోని సింగరాయపల్లె ఆర్ఓ ప్లాంట్ ప్రైవేట్ బోనస్!

అధికారుల ‘కక్కుర్తి’.నేతల ‘కబ్జా’.ఎగువతంబళ్లపల్లె గ్రామపంచాయతీ లోని సింగరాయపల్లె ఆర్ఓ ప్లాంట్ ప్రైవేట్ బోనస్!

📰 Generate e-Paper Clip

కలసపాడు జూలై 03 ప్రజావాణి ప్రజాధనాన్ని నిలువునా ముంచేస్తూ,పేద ప్రజల దాహార్తిని పెట్టుబడిగా మార్చుకునే నీచమైన దందా కలసపాడు మండలంలో బహిర్గతమైంది.తంబళ్లపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని  సింగరాయపల్లె గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆరో వాటర్ ప్లాంట్ అవినీతి తిమింగలాల పాలిట కామధేనువుగా మారింది.ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన ప్లాంట్‌ను ప్రభుత్వానికి అప్పగించకుండా,అధికారుల అండతో ఒక స్థానిక రాజకీయ నాయకుడు పక్కదారి పట్టించి,బహిరంగంగానే ప్రైవేట్ దందాకు తెరలేపడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.అధికారుల కుమ్మక్కు భాగోతం.పక్కా స్కెచ్‌తో దోపిడీ!సింగరాయపల్లెగ్రామ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఆరో ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. అయితే,ప్లాంట్ పనులు పూర్తయిన తర్వాత దానిని పంచాయతీకి హ్యాండోవర్ చేసి,ప్రజలకు తక్కువ ధరకే స్వచ్ఛమైన నీటిని అందించాలనే కనీస నిబంధనను ఇక్కడి అధికారులు తుంగలో తొక్కారు.నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం,స్థానిక రాజకీయ నేత విసిరిన కాసుల కక్కుర్తికి లొంగిపోయి,సదరు నాయకుడికి పూర్తిగా కొమ్ముకాస్తూ మూగనోము వహించింది.ప్రభుత్వ ఆస్తిని ఒక ప్రైవేట్ వ్యక్తి సొంత జాగీరులా మార్చుకునేందుకు అధికారులు వెనకనుండి నడిపించిన కుమ్మక్కు భాగోతంపై గ్రామస్థులు నిప్పులు చెరుగుతున్నారు.కానుకల పేరిట దోపిడీ.ఇంత ఇస్తేనే నీళ్లు’ అంటూ రేట్ల ఫిక్సింగ్! ప్రభుత్వ ప్లాంట్‌ను అక్రమంగా తన గుప్పిట్లోకి తీసుకున్న సదరు రాజకీయ నాయకుడు,దీనిని ఒక భారీ లాభాల వ్యాపారంగా మార్చేశారు.బయట మార్కెట్‌లో కానుకల పేరిట,కమీషన్ల పేరిట భారీ మొత్తంలో రేట్లు ఫిక్స్ చేసి,క్యాన్ వాటర్‌ను అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.”ప్రభుత్వ ప్లాంట్. ప్రైవేట్ బిజినెస్”అన్న చందంగా సాగుతున్న ఈ దోపిడీలో.ప్లాంట్ నిలబెట్టడానికి సహకరించిన అధికారులకు కూడా వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ఉచితంగా లేదా నామమాత్రపు ధరకే అందాల్సిన తాగునీటిని, ఇలా మాఫియా తరహాలో అమ్ముకోవడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.కళ్లెదుటే ప్రభుత్వ సొమ్ము లూటీ అవుతున్నా,స్థానిక పంచాయతీ,మండల అధికారులు కళ్ళుండీ చూడలేని కబోదుల్లా వ్యవహరించడం వెనుక ఉన్న‘అసలు’రహస్యం ఏమిటో అందరికీ తెలిసిందే.ఈ బహిరంగ దోపిడీపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని స్థానికులు గట్టిగా డిమాండ్చే స్తున్నారు.అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారులను ప్లాంట్‌ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల దాహార్తిని తీర్చాలని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.