📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetఅంగన్వాడి పోస్ట్ లలో అవకతవకలు! స్థానికేతరులకు పోస్ట్లు వచ్చేలా పైరవీలు..

అంగన్వాడి పోస్ట్ లలో అవకతవకలు! స్థానికేతరులకు పోస్ట్లు వచ్చేలా పైరవీలు..

📰 Generate e-Paper Clip

అంగన్వాడి పోస్ట్ లలో అవకతవకలు!

స్థానికేతరులకు పోస్ట్లు వచ్చేలా పైరవీలు..

రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో ఎటువంటి చర్యలు తీసుకొని అధికారులు.

మఠంపల్లి జూలై 27 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో అంగన్వాడి పోస్ట్ లలో అవకతవకలు. కొన్నిచోట్ల స్థానికేతరులకు అంగన్వాడీ పోస్టులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం స్థానికంగా కలవరపెడుతున్నాయి.
స్థానికేతరులు అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. అంగన్‌వాడీ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు ఖచ్చితంగా స్థానిక నివాసి అయి ఉండాలి. స్థానిక నిబంధనలు అంగన్‌వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసే మహిళలు సంబంధిత గ్రామం, పట్టణం లేదా వార్డుకు చెందిన స్థానికులై ఉండాలి. గిరిజన ప్రాంతాలు, తండాలు లేదా గూడేలలోని పోస్టులకు కేవలం ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులు. ఇతర ప్రాంతాల వారు లేదా స్థానికేతరులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అవకాశం లేదు. ఈ విషయం తెలిసినా కూడా కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అధికారులకు మాయ మాటలు చెప్పి స్థానికత లేకున్నా కూడా ఆధార్ కార్డు రాకుండా ఓటర్ ఐడి లేకుండా తులమోఫలము ఇచ్చి అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు ఈ ప్రక్రియ మొత్తం ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతుందా! తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా? అని మండల ప్రజలు షాక్ అవుతున్నారు. ప్రతి విషయంలోనూ ఇలా అధికారులు పట్టించుకోకుండా అర్హతలు లేని వాళ్లకు ఉన్న పోస్టులు ఇచ్చేస్తే అర్హత ఉన్న వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి అదే గ్రామంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఈ అంగన్వాడీ పోస్టుల అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.