📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetహైటెన్షన్ వైర్ తెగిపడి రెండు కుక్కల మృతి --గ్రామ ప్రజల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

హైటెన్షన్ వైర్ తెగిపడి రెండు కుక్కల మృతి –గ్రామ ప్రజల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, జూన్ 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ సబ్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడింది.వైర్ తెగిపడిన సమయంలో అక్కడ సంచరిస్తున్న రెండు కుక్కలు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి.ఈ ఘటనను గమనించిన గ్రామ ప్రజలు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు.గ్రామ ప్రజల అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. తెగిపోయిన విద్యుత్ వైర్ సమీపంలో ఆ సమయంలో ఎవరైనా ప్రజలు సంచరిస్తే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని,అదృష్టవశాత్తూ ఘటన సమయంలో అక్కడ మనుషులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
వర్షాకాలంలో విద్యుత్ తీగలు తెగిపడినట్లు గమనిస్తే వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.