📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetస్వర్ణభారతి ట్రస్ట్ చలివేంద్రం ముగింపు దాతలకు ఘన సన్మానం

స్వర్ణభారతి ట్రస్ట్ చలివేంద్రం ముగింపు దాతలకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

స్వర్ణభారతి ట్రస్ట్ చలివేంద్రం ముగింపు, దాతలకు ఘన సన్మానం..
ఏడేళ్లుగా నిరంతరాయంగా చలివేంద్రం..
కోదాడ, జూన్10/ ప్రజావాణి
​కోదాడ పట్టణంలో గత 70 రోజులుగా బాటసారుల దాహార్తిని తీర్చిన స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రం బుధవారంతో ముగిసింది. మండు వేసవిలో బాటసారులకు తాగునీరు అందించేందుకు ట్రస్ట్ నిర్వాహకులు గత ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు.
​ఈ ఏడాది చలివేంద్రం ద్వారా ప్రతిరోజూ 4,000 మందికి పైగా ప్రజలు దాహార్తిని తీర్చుకున్నారు. ఈ సేవా కార్యక్రమానికి దాదాపు రూ. 1.5 లక్షల వరకు ఖర్చు కాగా, ఇందుకు ఆర్థికంగా సహకరించిన ప్రముఖ దాతలు చక్కా హరిబాబు, వరగాని రామకృష్ణ, రుద్రయ్య, నాగుబండి రంగాలను ట్రస్ట్ ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. నిరంతరాయంగా బాటసారులకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తూ స్వర్ణభారతి ట్రస్ట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని దాతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి యాదా సుధాకర్, స్వర్ణభారతి స్వయం సేవక్ సభ్యులు చీదేళ్ళ హనుమంతరావు, దేవరశెట్టి శంకర్,పల్లవి శ్రీనివాససరావు, మట్టపల్లి శ్రీనివాసరావు, బండారు శ్రీనివాసరావు, స్వామి శ్రీనివాసరావు,యువజన విభాగం నాయకులు పత్తి నరేందర్,గుడుగుంట్ల సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.