📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyవిశ్వనాథ్‌పూర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశ్వనాథ్‌పూర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

విశ్వనాథ్‌పూర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కొందుర్గు మండల పరిధిలోని విశ్వనాథ్‌పూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ సుండు శ్రీలత రాములు జాతీయ జెండాను ఆవిష్కరించగా, ప్రాథమిక పాఠశాల ఆవరణలో ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ఎన్నో మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలు, ప్రజల సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో అనేక మంది చేసిన త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

అలాగే రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం విశేష పురోగతి సాధించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకయ్య, జే. రమేష్ నాయక్, ఉప సర్పంచ్ గుండేటి రాజ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచులు ఎలుగంటి శ్రీధర్ రెడ్డి, లంకాల రామకృష్ణారెడ్డి, వార్డు సభ్యులు ఆకుల రమేష్, పుట్టపాటి శ్రీనివాస్, సుండు సునీత, సుక్కమ్మ, అనురాధ, అంగన్‌వాడీ టీచర్ ఆకుల అరుణ, ఆరోగ్య కార్యకర్తలు ఉమాదేవి, కవిత, చిప్ప ప్రకాశ్, ఆకుల నాగలింగం, ఎద్దు కృష్ణయ్య, పవన్ గౌడ్, దాసరి నర్సింలు, యాదయ్య, బాల ఆంజనేయులు, ఎద్దు బాలాంజన్, బేగరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.