📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ పాఠ్యాంశాల ప్రక్షాళన జరగాలి బి.ఎస్.పి బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు చెందులూరి బ్రహ్మయ్య

ప్రభుత్వ పాఠ్యాంశాల ప్రక్షాళన జరగాలి బి.ఎస్.పి బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు చెందులూరి బ్రహ్మయ్య

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 27) రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి హైస్కూల్ స్థాయిలో అమలు చేస్తున్న అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రక్షాళన చేయాలని బహుజన సమాజ్ పార్టీ బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు చందులూరి బ్రహ్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సైన్సు సబ్జెక్టుకు సంబంధించి హై స్కూల్ స్థాయిలో ఉన్న సీసీఈ మోడల్ పాఠ్యాంశాలు ఇంజనీరింగ్,ఎంబిబిఎస్ కోర్సుల అర్హత పరీక్షలకు సంబంధించిన కనీస ప్రాథమిక అంశాలు కూడా లేని పరిస్థితి ఎదుర్కొందన్నారు.దీని వలన ప్రతి విద్యార్థి ఎంసెట్,నీట్ లాంటి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే కార్పొరేట్ విద్యను తప్పనిసరిగా అభ్యసించే పరిస్థితి ఉందన్నారు.పేద,మధ్య తరగతి,గ్రామీణ ప్రాంత విద్యార్థులు లక్షల ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్యను అందుకునే పరిస్థితి లేదన్నారు.ఎంతో మంది పేద విద్యార్థులకు ఇంజనీర్,డాక్టరు లాంటి కలలు కలగానే మిగిలిపోతున్నాయన్నారు.అంతేగాక సాంఘిక శాస్త్రంలో భారత చరిత్ర,రాష్ట్ర చరిత్ర,రాజ్యాంగం,ఆర్థిక శాస్త్రం లేకపోవడం ఎంతో దౌర్భాగ్యం అన్నారు.ఈనాటి విద్యార్థులకు మహాత్మా గాంధీ,అంబేద్కర్,సుభాష్ చంద్రబోస్ ఇంకా ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఎవరో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు.భవిష్యత్తులో విద్యార్థులు ఐఏఎస్,ఐపీఎస్ సాధించాలంటే హై స్కూల్ స్థాయిలో సాంఘిక శాస్త్రంలో కనీస ప్రాథమిక అంశాలు లేకపోవడం ఎంతో దౌర్భాగ్యం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న విద్యా పాఠ్యాంశాలలో మార్పులు తీసుకుని రావాలని,ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయిలో పాఠ్యాంశాలు ఉండేటట్లు ప్రణాళికను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.