📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaపచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

📰 Generate e-Paper Clip



*సర్పంచ్ బండి రేణుక శంకర్*

నడికుడ,జూన్ 19(ప్రజా వాణి ):మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాఠశాల ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ మొక్కలను నాటారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మొక్కలను నాటాలని లేదా పిల్లల పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని తల్లిదండ్రులను కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూచెట్లు మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అందిస్తాయని,చెట్లు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయని,చెట్లు మనకు నీడను ఇస్తాయని,చెట్లు పండ్లు, పూలు మరియు ఔషధాలను అందిస్తాయని,
చెట్లు వర్షపాతం పెరగడానికి సహాయపడతాయని,చెట్లు నేల కోతను నివారిస్తాయని,పక్షులు మరియు జంతువులకు చెట్లు ఆశ్రయం కల్పిస్తాయని,చెట్లు వాతావరణ సమతుల్యతను కాపాడుతాయని,ప్రతి మనిషి కనీసం ఒక చెట్టును నాటాలని,చెట్లను రక్షించడం మన అందరి బాధ్యత అని అన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రము 1, 2 లలో సర్పంచ్ బండి రేణుక శంకర్ అంగన్వాడి విద్యార్థులకు ఉచిత యూనిఫాం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఉపాధ్యాయులు కంచరాజు కుమార్, పుల్లూరి రామకృష్ణ, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్యా, గ్రామపంచాయతీ సిబ్బంది శరత్, ఆయాలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.