📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialతెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ.

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం పారిగాం గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ రాజక్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం ప్రజల ఆకాంక్షల ఫలితమని, రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శారదా, కొండయ్య, మాజీ వార్డు సభ్యులు బహుజీ, తాజా వార్డు సభ్యులు సాకార్చంద్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.