📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriటీపీసీసీ మీడియా చైర్మన్ శ్యామ రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వినోద్. 

టీపీసీసీ మీడియా చైర్మన్ శ్యామ రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వినోద్. 

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూన్ 10: టీపీసీసీ మీడియా చైర్మన్ శ్యామ రామ్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపవుల వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో శ్యామ రామ్మోహన్ రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.

ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతూ పార్టీకి, సమాజానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించిన వినోద్ కుమార్, భగవంతుడు శ్యామ రామ్మోహన్ రెడ్డికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదించి మరిన్ని విజయాలు సాధించేలా ఆశీర్వదించాలని కోరారు.

“ప్రజా సేవే లక్ష్యంగా నిరంతరం ముందుకు సాగుతున్న శ్యామ రామ్మోహన్ రెడ్డి గారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజల ప్రేమాభిమానాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.