📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetజిల్లాలోనూతనంగా మంజూరైన (86) పూర్వప్రాథమిక పాఠశాలల్లో, తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హత ఉండి ఆసక్తి ఉన్న...

జిల్లాలోనూతనంగా మంజూరైన (86) పూర్వప్రాథమిక పాఠశాలల్లో, తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హత ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్, జూన్ 9, ప్రజావాణి

సిద్దిపేట జిల్లాలోనూతనంగా మంజూరైన (86) పూర్వప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హత ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో నూతనంగా మంజూరైన 86 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఈ విద్యాసంవత్సరం నుండి స్థానిక ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రారంభించడం జరుగుతుందనిఈ పాఠశాలల్లోని బోధించడానికి అర్హత గల స్థానిక అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.ఉపాధ్యాయ అర్హతలు:ఇంటర్మీడి యట్ తత్సమాన అర్హత, పూర్వ ప్రాథమిక లేదా ప్రాథమిక విద్యకోర్సు చేసినవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడునన్నారు.రూ. 8,000/- నెలకు  వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు.ఆయాగా పనిచేయుటకు 7 వ తరగతి ఉత్తీర్ణత హై ఉండాలని,రూ. 6,000/- నెలకు వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు.నోటిఫికేషన్ నాటికి 18 సంవత్సరాలనుండి 44 సంవత్సరాలవరకు వయసు ఉండాలని,(ఎస్సీ / ఎస్టి /బీసీ / ఈ డబ్ల్యూ ఎస్) అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదని, స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడునని,దరఖాస్తులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారికార్యాలయంలో తేదీ: 08.06.2026 నుండి 12-06-2026 వరకు సాయంత్రం 5:00 గంటల లోపు స్వీకరించబడునని, దరఖాస్తు పత్రాలు మరియు ఇతర వివరాలు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలోలేదా www.deosiddipet.in వెబ్సైట్లో పొందగలరనీ జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.