📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyకరెంట్ తీగలు తగిలి  రైతు  మృతి

కరెంట్ తీగలు తగిలి  రైతు  మృతి

📰 Generate e-Paper Clip

*కరెంట్ తీగలు తగిలి  రైతు  మృతి*

*పొలం పనులకు వెళ్లగా కాటేసిన విద్యుత్ వైర్లు*


*ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు అనంతవాయువులో కనుమరుగు*

*సకాలంలో స్పందించి అంబులెన్స్ పిలిచినా దక్కని ఫలితం కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు*




  షాబాద్//జూన్ 15
( ప్రజావాణి)


రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అత్యంత విచారకరమైన ఘోర ప్రమాదం సంభవించింది చేతికొచ్చిన పంటను సాగు చేసుకునేందుకు పొలం బాట పట్టిన ఒక అన్నదాతను ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంట్ తీగలు బలితీసుకున్నాయి మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ ఘాతానికి  గురై కాకునూరు లక్ష్మణ్ అనే సామాన్య రైతు మృత్యువాత పడ్డారు ఈ దారుణ ఘటనతో బోడంపహాడ్ గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడంపహాడ్ గ్రామానికి చెందిన రైతు కాకునూరు లక్ష్మణ్ ఎప్పటిలాగే సోమవారం మధ్యాహ్నం వేళ తన పొలం పనులను పర్యవేక్షించేందుకు వెళ్లారు. అయితే చేను వద్ద ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్న లైవ్ విద్యుత్ తీగలను  గమనించకుండా, అవి ప్రమాదవశాత్తు ఆయన శరీరానికి తగలడంతో ఒక్కసారిగా బలమైన కరెంట్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో కిందపడిపోయారు లక్ష్మణ్ కింద పడి ఉండటాన్ని గమనించిన తోటి రైతులు మరియు స్థానికులు తక్షణమే స్పందించి ప్రాణాలు రక్షించేందుకు శ్రమించారు. అత్యవసర సహాయం కోసం వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అంబులెన్స్ వాహనం పొలం సమీపంలోకి చేరుకుంది. స్థానికుల సహాయంతో బాధితుడు కాకునూరు లక్ష్మణ్‌ను అంబులెన్స్ లోకి ఎక్కించి అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆసుపత్రికి చేరుకునే మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు అనంతవాయువులో కనుమరుగయ్యాయి. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించాడని ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పొలాల్లో వదులుగా ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలపై గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు తమ తోటి రైతు కాకునూరు లక్ష్మణ్ ప్రాణం పోయిందని బోడంపహాడ్ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మరణించిన రైతు లక్ష్మణ్ కుటుంబానికి భారీ ఎక్స్‌గ్రేషియా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.